ఫిబ్రవరి 18న ఢిల్లీ లో సామాజిక పరిస్థితులపై ధర్మ దీక్ష

 

హైదరాబాద్ జనవరి 30 (globelmedianews.com)
భారత దేశ సామాజిక పరిస్థితులపై ఢిల్లీ లో ఫిబ్రవరి 18న జరిగే ధర్మ దీక్ష కరపత్రాలను మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నేడు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో త్యాగదనుల త్యాగాలు వెక్కిరించే పరిస్థితి ఏర్పడిందని, కావున సామాజిక పరిస్థితులు మెరుగు పడాలని తెలుపుతూ ఆశీర్వదించారు. 
 ఫిబ్రవరి 18న ఢిల్లీ లో సామాజిక పరిస్థితులపై ధర్మ దీక్ష    

సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పోకల కిరణ్ కుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వేలాది మంది మన మెంతో మన వాటా అంతని కదిలిరావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి దయానందరావు, ప్రముఖ విద్యావంతులు 126డిగ్రీస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత పి జె సుధాకర్, సోషల్ జస్టిస్ ఫర్ ఇండియన్ లాయర్స్  అసోసియేషన్ అధ్యక్షుడు  యన్ యస్ యాదవ్, లాయర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు..

No comments:
Write comments