లిబియాలో స్కూల్ పై దాడి: 30 మంది పిల్లల మృతి

 

లిబియా జనవరి 6   (globelmedianews.com)
లిబియా దేశం ట్రిపోలిలోని ఓ ఆర్మీ స్కూల్‌పై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది విద్యార్థులు మృతి చెందగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అమీన్ అల్ హషేమీ తెలిపారు. దక్షిణా ట్రిపోలిలోని అల్ హబ్దా అల్ ఖద్రా ప్రాంతంలో జరిగింది.
లిబియాలో స్కూల్ పై దాడి: 30 మంది పిల్లల మృతి

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ ఎకార్డ్ (జిఎన్ఏ) ఆధ్వర్యంలో ఉన్న ట్రిపోలి లో ఆ దేశ మిలిటరీ కమాండర్ ఖలీఫా హఫ్తార్ ఆధ్వర్యంలోని లబియా నేషనల్ ఆర్మీ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే లిబియా నేషనల్ ఆర్మీ తమ జోక్యం లేదని ప్రకటించింది. ఈ ఘటనపై లిబియ్ ప్రెసిడెన్సియల్ కౌన్సిల్ దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది.

No comments:
Write comments