అర్హత వున్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

 

జిల్లా కలెక్టర్‌ జి. వీరపాండియన్.
కర్నూలు, జనవరి 25  (globelmedianews.com)
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడమేగాక, తోటి వారితో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపి ఓటరుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టరు జి. వీరపాండియన్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో శనివారం పదవ జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన కార్యక్రమంతో పాటు జిల్లాస్థాయి ఉత్సవములు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్,  డిఆర్ఓ పుల్లయ్య, డిఆర్డిఏ పిడి శ్రీనివాసులు, మెప్మా తిరుమలేశ రెడ్డి,  సీఈఓ నాగరాజు నాయుడు, వై ఎస్ ఆర్ సి పి నాయకులు తోట కృష్ణారెడ్డి, సిపిఐ నాయకులు శ్రీనివాసరావు, రామాంజనేయులు, సిపిఎం నాయకులు షడ్రక్, సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు తిమ్మప్ప, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. 
అర్హత వున్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఓటర్లకు సందేశం ఇచ్చారు. కుల, మత, జాతి, వర్గ భాషలకు ఎలాంటి వత్తిడులకు ప్రభావితం కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటును వినియోగించుకుంటామని హాజరైన సభికులచే డిఆర్ఓ పుల్లయ్య  ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం తోపాటు సంస్కృతిని పాటించాలన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో హక్కులను అందరూ వినియోగించుకొని తమ బాధ్యతను మరవకూడదు అన్నారు. మంచి ఆలోచనతో దూరదృష్టి దృష్టిలో పెట్టుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలి అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉందన్నారు. ప్రభుత్వాలను ఎన్నుకునే బాధ్యత కూడా ఓటరుకు మాత్రమేవుంటుందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్ తన ఓటు నిర్భయంగా తమకు నచ్చిన వారికి ఓటు వేసి ఎన్నుకోవాలి అన్నారు. కుల, మతాలకు అతీతంగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశ పౌరులకు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. అదేవిధంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైందన్నారు. 1952 నుంచి భారత ఎన్నికల సంఘం సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ అన్ని దేశాల మన్ననలను పొందిందన్నారు. 2011 నుంచి జాతీయ ఓటర్ల దిననోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఓటర్లలో అవగాహన పెంచుతున్నామన్నారు.
ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్‌ సిటిజన్ లను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అనంతరం 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న యువతకు ఎపిక్‌ కార్డులను అందజేశారు. ఓటు ప్రాధాన్యతపై నిర్వహించిన జిల్లాస్థాయి,  వ్యాసరచన, వక్తృత్వ పోటీలు తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థినీ, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రదానం చేసారు.

No comments:
Write comments