రాంపల్లి గ్రామ వాలంటీర్ సతీష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

 

కేసు గురించి విచారించిన పత్తికొండ రూరల్ సీఐ ఆదినారాయణ రెడ్డి
తుగ్గలి జనవరి 2 (globelmedianews.com)
నూతన సంవత్సరం రోజున తుగ్గలి మండల పరిధిలో రాంపల్లి గ్రామంలో గాయపడిన వాలంటీర్ రామానాయడు ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్లెక్సీ ను కడుతున్న గ్రామ వాలంటీర్ పై దాడి చేయడం చాలా ఘోరమని,దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె తెలియజేశారు.
రాంపల్లి గ్రామ వాలంటీర్ సతీష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

వాలంటీర్ రామానాయుడు కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు ముఖ్య వారధిలా పనిచేసే వాలంటీర్ల పై దాడి చేయడం సరికాదని ఆమె తెలియజేశారు.అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతూ,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా పరామర్శించారు.రాంపల్లి లో జరిగిన ఘటన పై గురువారం  సీఐ ఆదినారాయణ రెడ్డి తుగ్గలి పోలీస్ స్టేషన్ ను సందర్శించి,ఎస్సై రమేష్ బాబు ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కేసు విచారణ ముమ్మరం చేయాలని ఎస్ఐ రమేష్ బాబు కు తెలియజేశారు.

No comments:
Write comments