ప్రతి ఇంటికి ఇంకుడుగుంత వుండాలి

 

వరంగల్ రూరల్ జనవరి 08 ( globelmedianews.com)
రెండవ  విడత పల్లె ప్రగతి లో భాగంగా పర్వత గిరి గ్రామంలో పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బుధవారం పరిశీలించారు.  అనంతరం గ్రామసభ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్,  జిల్లా పరిషత్  చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వర్ధన్నపేట శాసనసభ సభ్యుడు ఆరూరి రమేష్,  ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం లో మన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ని చూడలేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ తో మన ముఖ్యమంత్రి  వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. పర్వతగిరి లో ఇంకా అభివృద్ధి జరగాలి. 
ప్రతి ఇంటికి ఇంకుడుగుంత వుండాలి

పర్వతగిరి మండలం కోసం కొట్లాడినానని అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్నారు, నీళ్లు రావు అన్నారు గత ప్రభుత్వాలు.. కానీ ఇప్పుడు 24 గంటల కరెంట్ ను,ప్రతీ ఇంటికి శుద్ధమైన నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కే దక్కుతుంది. గత 3 నెల ల నుండి  కాల్వ ల లో నీరు నిరంతరం గా ప్రవహిస్తోంది. పెన్షన్ ను పెంచడం తో పెన్షన్ దారుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. పెట్టుబడి సాయం అందిస్తూ...వ్యవసాయం మీద ఆధార పడ్డ వాళ్ళని మన ముఖ్యమంత్రి  ఆదుకున్నారని అన్నారు. పర్వతగిరి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా ఇస్తా. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి...15 రోజుల్లో ప్రతి వార్డు లో ఇంకుడు గుంత లేకపోతే..ఆ వార్డు సభ్యున్ని మీద చర్య తీసుకుంటా. గ్రామస్థులందరు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఊరిని అభివృద్ధి చేసుకోండి. ఇంకుడు గుంత లేని ఇంటికి రేషన్ బియ్యం, పెన్షన్ రద్దు అవుతుంది. షాప్ ల ముందు  చెత్త కనపడితే 1000, ఇంటి ముందు ఉంటే 500 రూపాయల జరిమానా పడుతుంది. ఊరు బాగు చేసేందుకు సిద్దం గా ఉన్నా... ప్రజలు సహకారం అందిస్తేనే అభివృద్ధి అవుతుందని అన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాకున్నా..రూర్బన్ పథకం కోసం 33 కోట్ల ను విడుదల చేసాను. మన ముఖ్యమంత్రి  ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండని కోరారు.శాసనసభ సభ్యుడు ఆరూరి రమేష్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం తో అభివృద్ధి అవుతుంది.గ్రామంలో పుట్టిన ప్రతీ బిడ్డ శ్రమదానం లో పాల్గొనాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో నే ఎక్కువ నిధులు వివిధ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నాం. మన ఇల్లు,వాడ శుభ్రంగా ఉండాలని అన్నారు. అన్నీ వర్గాల్లో ఆనందం చూడడానికి ముఖ్యమంత్రి అను నిత్యం ఆరాట పడుతున్నారు. ప్రతీ గడప కి ఎదో ఒక సంక్షేమ పథకం అందుతుంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లా వేళలా కృషి చేస్తానని అన్నారు. 45 కోట్ల నిధులను వివిధ రకాల అభివృద్ధి కి నిధులను కేటాయించామని అన్నారు.జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ 👉రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి పనులతో పండగ వాతావరణం నెలకొంది. ఏ రాష్ట్రంలో   లేని విధంగా ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమన్నీ రూపొందించారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతీ గ్రామంలో డంప్ యార్డ్, వైకుంఠ ధామం, నర్సరీ ఉండాలన్న ముఖ్యమంత్రి  ఆలోచన కు తగ్గట్టు అందరూ పని చేయాలని అన్నారు.పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం చేసాం. ఆ ఉద్యమ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నము. తెలంగాణ వచ్చాక పెన్షన్ పెరిగింది. ఆడబిడ్డ ల పెళ్ళి ళ్లు చేయడానికి కష్టాలు పడుతున్న తల్లిదండ్రులను కళ్యాణ లక్ష్మీ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. 400 కి పైగా సంక్షేమ పథకాలను ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందిస్తోంది. పల్లె ప్రగతి ద్వారా మన పల్లె లను అభివృద్ధి చేసుకుందాం. 20 లక్షల నిధులను ఈ మండలం అభివృద్ధి కోసం ఇస్తానని అన్నారు.

No comments:
Write comments