పదో తరగతి విద్యార్థికి కీలక మెట్టు

 

చదువుతోనే పేదరికానికి దూరం చేయవచ్చు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.
కర్నూలు, జనవరి 31 (globelmedianews.com)
ప్రతి విద్యార్థికి పదవ తరగతి కీలక మెట్టు లాంటిదని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ బంగ్లా కార్యాలయం నుంచి జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో వెనుకబడిన విద్యార్థులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినూత్న రీతిలో పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పలు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రేరణ కలిగేలా వీడియో కాన్ఫరెన్స్ లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థికి చాలా కీలకమని, ఏ ఉద్యోగం చేయాలన్న పదవతరగతి ఖచ్చితంగా పాస్ కావాలి అన్నారు. భవిష్యత్తు ఉన్నతస్థానానికి ఎదగాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. 
పదో తరగతి విద్యార్థికి కీలక మెట్టు

సమాజంలో ప్రతి మనిషికి స్థానం, హోదా ఉంటుందని, సమాజంలో గుర్తింపు రావాలంటే మరింత కష్టపడాలి అన్నారు. తాను పేద కుటుంబంలో వచ్చిన విద్యార్థిని అని అప్పుడు బాగా కష్ట పడడం వల్ల ఈ స్థానానికి ఎదిగానని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు. పేదరికం దూరం కావాలంటే ఒక చదువుతో మాత్రమే దూరం చేయవచ్చన్నారు. భవిష్యత్తులో ఏ స్థానానికి ఎదగాలి అనుకుంటున్నారో, ఆ లక్ష్యం చేరుకోవాలంటే పదవతరగతి కచ్చితంగా పాస్  కావాలన్నారు. మీ ఆశయం నెరవేరాలంటే ఇష్టపడి కష్టపడి చదవాలన్నారు. భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలంటే మొదటగా లక్ష్యం ప్రతి విద్యార్థి ఎంచుకోవాలి అన్నారు. 10 పబ్లిక్ పరీక్షలు ఒక్క నెల సమయం మాత్రమే ఉందని తక్కువ సమయంలో ఇప్పటి నుంచి ఏకాగ్రతతో చదివితే పది సులువుగా పాస్ అవుతారు. మొట్టమొదటిసారి కలెక్టర్ గా పదవ తరగతిలో వెనుకబడిన విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని మీలో ప్రేరణ, చదువు మీద శ్రద్ధ కలిగే విధంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది అన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా చదవడం కన్నా ఎక్కువసార్లు రాయడం ముఖ్యమన్నారు. పేపర్ లో ఎంత బాగా రాశారో వారికి మాత్రమే మంచి మార్కులు వస్తాయన్నారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎటువంటి టెన్షన్ లోనుకాకుండా ఎనిమిది గంటలు చదివి ఐదు గంటలు రాయడానికి సమయం కేటాయిస్తే మంచి మార్కులు వస్తాయి అన్నారు. పరీక్షల్లో పాస్ కావడానికి చాలా సులభమైన మార్గం అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పదోతరగతి విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్లో ఇంత వరకు ఏమి అర్థమైంది, పదిలో ఉత్తీర్ణత ఎలా సాధిస్తారని అంశాలపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కలెక్టర్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయుల ఉద్దేశించి మాట్లాడుతూ  పదవ తరగతి ఫలితాలు 100% వచ్చేలా విద్యార్థులకు ఇప్పటినుంచి పదేపదే రాయించడం చేయాలన్నారు.   వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం, విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్ లు,  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments