వరి సాగు క్షేత్రాన్ని పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి

 

త్రిసూర్  జనవరి 7 (globelmedianews.com)
కేరళ లోని త్రిసూరులో వయిగా 2020 సదస్సులో తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గోన్నారు.  వ్యవసాయంలో రైతుల పంటలను లాభదాయకం చేయడం ఎలా అన్న అంశంపై ఈ  అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. అంతకుముందు - త్రిసూరు సమీపంలోని పుల్లయి వరి సాగు క్షేత్రాన్ని మంత్రి  పరిశీలించారు.  అక్కడ సాగు తీరు , వ్యవసాయ యాంత్రీకరణ, దిగుబడి, నీటి తీరువా, కూలీల పరిస్థితిపై రైతులతో ఆరా తీసానే.  900 ఎకరాలలో సంఘటితంగా సహకార సంఘం రైతులు ఏర్పాటు చేసుకుని సాగుచేస్తున్నారు.  
వరి సాగు క్షేత్రాన్ని  పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ధాన్యం ఒకరోజు నీటిలో తడిపి చిన్న మొలకలు రాగానే మడిలో రైతులు చల్లుతున్నారు. కలుపు రాకుండా 20 రోజుల పాటు పొలం ఆరబెట్టి మందు పిచికారి చేసి మడికి నీళ్లు ఇచ్చి కలుపు నివారిస్తున్నారు.  ఎకరానికి 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి,  కూలీల కొరతను ఎదుర్కొనేందుకు రైతులు సహకారసంఘంగా ఏర్పడ్డారు. స్పామ్ పథకం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు,  నేరుగా రైతుల అకౌంట్లో సబ్సిడీ డబ్బులు,  సహకార వ్యవసాయం బాగుందని మంత్రి అన్నారు.  తెలంగాణలో కరీంనగర్ జిల్లా కు చెందిన  తిరుపతి రెడ్డి, లక్ష్మి రైతు దంపతులు ఆరుతడి వరి పండిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించే ఫలితాలు సాధించారు.

No comments:
Write comments