గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ

 

భూదాన్ పోచంపల్లి జనవరి 25 (globelmedianews.com)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని పోచంపల్లి మండల కేంద్రంలోనిజిబ్లాక్పల్లి గ్రామంలో శుక్రవారంనాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న లచ్చి లింగస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో నట్టల మందు వేయించి ఇతర వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 
గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ

గొర్రెల కాపలాదారుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి గొర్రెల మేకల వ్యాధి వచ్చిన తక్షణమే మందులు వేసి వాటిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ లింగస్వామి మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సిబ్బంది రమేష్ నాగేందర్ శ్యామ్ మల్లయ్య ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments