అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

 

జైలు నుంచి విడుదలైన విద్యార్థి నాయకులు
కౌతాళం జనవరి 9 (globelmedianews.com)
అక్రమ కేసులు అరెస్ట్ లతో  ఉద్యమాలు ఆపలేరని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షలు కార్యదర్శులు మహేష్,ఈరన్న పేర్కొన్నారు. గత వారం కలెక్టర్, ఎమ్మెల్యేలను బీసీ హాస్టల్ , ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని అడ్డుకోవడం జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ నాగార్జున రెడ్డి  ఉద్యమాన్ని అణచివేయాలనే దుహంకార  చర్యతో విద్యార్థులు అని కూడా చూడకుండా మా పై నాన్బెయిలబుల్ కేసులు పెట్టి దాదాపుగా ఆరు రోజులుగా సబ్ జైల్లో ఉంచడం చాలా దారుణమని అన్నారు. 
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

అయితే అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించమంటే చేతకాక ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే  ఖబడ్దార్ అని హెచ్చరించారు. అదేవిధంగా మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో మోడల్ స్కూల్ నిర్మాణం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తూ మా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది కానీ, అణచివేయబడదు అని పేర్కొన్నారు.  భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కౌతాళం మండలం లో విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని, అదేవిధంగా రాజకీయాలకు, అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి లేదని మరోసారి హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన వారికి విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.

No comments:
Write comments