కార్మికుల హక్కులను కాలరాస్తే ప్రభుత్వ పతనం తప్పదు

 

ప్రభుత్వరంగ సంస్థలను--కార్పొరేట్ కు తాకట్టు పెడుతున్న ప్రభుత్వం
సిద్దిపేట, జనవరి 08 (globelmedianews.com)
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశ వ్యాప్తంగా అఖిల భారత కార్మిక సంఘాల యూనియన్ లు సార్వత్రిక సమ్మె లో భాగంగా బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో  ఏఐటియుసి,సిఐటియుసి)ల ఆధ్వర్యంలో కొత్త బస్ స్టేషన్ నుండికలెక్టర్ కార్యాలయం వరకు కార్మికుల తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టగా కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.అనంతరం సిపిఐజిల్లా కార్యదర్శి మంద పవన్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగా సంస్థలు కుంటు పడి ప్రైవేట్ రంగం విచ్చల విడిగా పెరిగిపోయిందని, ప్రభుత్వా నికి చేతగాకనే విదేశీ పెట్టుబడులు దేశంలో కి వచ్చి, 
కార్మికుల హక్కులను కాలరాస్తే ప్రభుత్వ పతనం తప్పదు

కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని,ఈ పరిణామాలతో రాబోవు కాలంలో ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి మాట్లాడుతూ కార్మికుల కు 21వెయిల జీతం అమలు చేయాలని, వ్యవసాయ రంగకు అధిక నిధులు విడుదల చేయాలని అన్నారు.తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ సిద్దిపేట సీనియర్ నాయకులు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ బ్యాంకులు విలీనం చేయడంసరికాదని, మోడీ ప్రభుత్వం పాలనలో దేశంలో మతోన్మాదులు పెరిగి, అశాంతి నెలకొంది అని అన్నారు.ఈ కార్యమానికి, బ్యాంక్, ఎల్ ఐసి, ఎలాక్ట్రిసిటీ, మెడికల్,  టియుడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  కూతురు రాజిరెడ్డి మద్దతు తెలుపగా , ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఈదరి మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టపురం లక్ష్మణ్, అందే అశోక్, ఇరి భూమయ్య, కనుకుంట్ల శంకర్, నక్క యాడవరెడ్డి, శేషిదర్, చంద్రం, మల్లేశం, కొమురయ్య, తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు.

No comments:
Write comments