ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

 

జిల్లా రవాణా శాఖాధికారి కిషన్ రావు
జగిత్యాల జనవరి 28 (globelmedianews.com)
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జగిత్యాల జిల్లా. రవాణా శాఖాధికారి కిషన్ రావు సూచించారు.  రోడ్డు భద్రత 31వ వార్షికోత్సవాల భాగంగా మంగళవారం జగిత్యాల జిల్లా లోని కరీంనగర్ నగర్ రోడ్డుపై జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో  వాహన చోదకులకు  వినూత్నంగా స్వాగతించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న వాహనదారులకు రవాణా శాఖ అధికారులు  డిటిఓ కిషన్ రావు, ఏఎంవిఐ అభిలాష్  పుష్పాలిచ్చి అభినందనలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ఈ సందర్భంగా రోడ్డు భద్రత అవగాహన పోస్టర్లును వాహనాలకు అతికించారు.ఆనంతరం  డిటిఓ కిషన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం  రాంగ్ రూట్లలోప్రయాణం చాలా ప్రమాదకరమని వారు వివరించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వాహనదారులు సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలని సూచించారు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని అందుకే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ కిషన్ రావు, ఏఎంవిఐ అభిలాష్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Write comments