రెండు రోజుల పాటు అదే పని

 

చెన్నై, జనవరి 29, (globelmedianews.com)
యువతిని రాక్షసంగా హింసించి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేయడంతో యువతి స్పృహతప్పి అపస్మారక స్థితికి చేరుకుంది.కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతిని ఎత్తుకెళ్లిన దుండగుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండ్రోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. అన్నం, నీళ్లు కూడా లేకుండా అత్యాచారం చేయడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరింది. రెండ్రోజుల తర్వాత బాధితురాలి సోదరుడికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. 
రెండు రోజుల పాటు అదే పని

దేశంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అన్నం, నీళ్లు కూడా లేకుండా యువతిని దారుణంగా హింసించి రేప్ చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. పుదుకోట్టై జిల్లా అరందాంగి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి(20) రాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు.రెండ్రోజుల తర్వాత నీ చెల్లెలు నా ఇంట్లో ఉందంటూ అదే ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సురేశ్(40) ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సురేశ్ ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులకు భయానక పరిస్థితిలో యువతి కనిపించింది. గదిలో యువతిని బంధించి రెండ్రోజులుగా అత్యాచారానికి పాల్పడిన సురేష్.. ఫోన్ చేసి సమాచారం అందించి పరారైనట్లు తెలుస్తోంది.కనీసం అన్నం, నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి.. అత్యాచారానికి పాల్పడడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సురేశ్‌కి ఇద్దరు భార్యలు కాగా.. మొదటి భార్య మృతి చెందింది. ఇద్దరికీ సరిపడక రెండో భార్య సురేశ్‌ను విడిచి వెళ్లపోయినట్లు తెలుస్తోంది. యువతి ఒంటరిగా బయటకు వెళ్లడం గమనించిన సురేశ్‌ తన ఇంటికి లాక్కెళ్లి బంధించి అత్యాచారానికి ఒడిగట్టునట్లు అనుమానిస్తున్నారు

No comments:
Write comments