రోడ్డు ప్రమాద బాధితులకు సేవలందించే వారిని సాక్షులుగా తీసుకోం

 

నిర్మల్ జనవరి 09 (globelmedianews.com)
 నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయములో బ్లూ కోల్ట్, పెట్రో డ్యూటి పోలీసు అధికారులకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, బాధితులకు చేయవలసిన సహాయము గురించి ఒక రోజు శిక్షణ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భములో సేవలందించి బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లే వారిని సాక్షులుగా స్వీకరించబోమని జిల్లా ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు సేవలందించి ఆసుపత్రులకు తీసుకెళ్ళి నట్లయితే కేసుల్లో పోలీసు వారు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి సాక్షులుగా ప్రవేశపెడతారని ఉన్న అపోహలు సరైనది కాదని చెప్పారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సేవలందించే వారిని సాక్షులుగా తీసుకోం

ప్రమాద రహిత రోడ్డ్లు మరియు మహిళల సురక్షకు సంభందించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో సహకరించే వారిని ఎట్టి  పరిస్థితులలో కూడా ఇబ్బంది కల్పించబోమని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం మంది నిర్ణీత సమయంలో  ప్రథమ చికిత్స అందక మృత్యువాత పడుతున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణ శాతం తగ్గించే లక్ష్యంతో పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని తెలిపారు. అన్ని పెట్రోలింగ్ వాహనాలు ప్రథమ చికిత్స అందించే పరికరాలతో (కిట్లను) ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంవత్సరానికి ఐదు లక్షల పైన ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది మృతి చెందుతున్నారని తెలిపారు. గత సంవత్సరంలో నిర్మల్ జిల్లా వ్యాప్తముగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 133 మంది మృతి చెందారని వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సౌకర్యం కోసం ఆసుపత్రులకు తరలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గించవచ్చునని, ప్రతి ఒక్క పొలిసు అధికారి రోడ్డు ప్రమాదములు జరిగినప్పుడు మానవత్వముతో బాధితులను కాపాడాలని సూచించారు.

No comments:
Write comments