పల్లె ప్రగతి ద్వారానే గ్రామ స్వరాజ్యం

 

వరంగల్ అర్బన్ (భీమదేవరపల్లి) 
జనవరి 9 (globelmedianews.com)
పల్లె ప్రగతి ద్వారా నే  గ్రామ స్వరాజ్యం  వస్తుందని జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జే పాటిల్ అన్నారు.   రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగంగా  గురువారం భిందేవరపల్లి మండలం లోని  మల్లారం  వీర్లగడ్డ తండా, కోతకొండ ధర్మారం  గ్రామాలలో పలు రకాల  పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు దిశ  నిర్దేశాల తో పాటుగా గ్రామాభివృద్ధికి కోసం వివిధ పనులను చేపట్టేందుకు నిధులను మంజూరు  చేస్తానని హామీ ఇచ్చారు.పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర ముఖ్య మంత్రి ముందు  చూపుతో ప్రవేశ పెట్టారని  ఈ పథకం లో అధికారులకు స్థానిక  ప్రజా  ప్రతినిధులకు ఏలాంటి భాద్యతలు ఉన్నాయో  గ్రామాభివృద్ధి కోసం ప్రజలకు కూడా  కొన్ని బాధ్యతలను   అప్పగించారని చెప్పారు.
పల్లె ప్రగతి ద్వారానే గ్రామ స్వరాజ్యం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటింటికీ ఇంకుడు గుంతలు   మొక్కల పెంపకం లాంటి  భాద్యతలను ప్రజలు చేయలని గ్రామాభివృద్ధికి  సమిష్టిగా కృషి చేస్తేనే  ముఖ్యమంత్రి ఆశయం  నెరవేరుతుందని అన్నారు   గతంలో ఏ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ఇంత   ప్రాధాన్యత  చొరవ చూపలేదని తెలంగాణ రాష్ట్రం లోనే  అమలు చేస్తున్నారని అందుకు మనమందరూ వచ్చిన అవకాశాన్ని రాజకీయాలకు అతీతంగా  ముందుకు వచ్చి మన గ్రామం ను అన్ని గ్రామాల కంటే అభివృద్ది లో ముందుండ లనే  సంకల్పం తో  ఆరోగ్యకరమైన పోటీతత్వం తో సమగ్ర అభివృద్ధికి   తోడ్పాటు నందించలని చెప్పారు  గ్రామాభివృద్ధికి అన్ని పనులకూ ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదని గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతంలో  ఉన్నత ఉద్యోగం గాని వ్యాపార వాణిజ్య రంగంలో   ఇతర రంగంలో  ఆర్థికంగా ఉన్న వారి ని  వద్ద నుండి  గ్రామ అభివృద్ధికి సహాయం చేయాలని  కోరారని  ప్రజలకు సూచించారు.ముందుగా భీందేవర పల్లి మండలంలోని మల్లారం లో  నర్సరీలో చేతి పంపు, శ్మశానవాటిక కు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రసూల్ పూర లో వైకుంఠ ధామానికి  ప్రహరీ గోడ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని  ఎంపీడీఓ ను ఆదేశించారు.

No comments:
Write comments