ఒంగోలు లో ఓటర్ల దినోత్సవ ర్యాలీ

 

ఒంగోలు, జనవరి 25, (globelmedianews.com):
ప్రజాస్వామ్యాన్ని పరిక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరి పై ఉందని జిల్లా రెవిన్యూ అధికారి వి.వెంకట సుబ్బయ్య చెప్పారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక ప్రకాశం  భవనం నుంచి ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం చర్చి సెంటర్ లో  విద్యార్ధులతో పెద్ద ఎత్తున మానవ హరం నిర్వహించారు. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం  అభినందనీయమని ఆయన అన్నారు.  ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరించడం ఆనవాయితిగా వస్తుందని అని చెప్పారు. 
ఒంగోలు లో ఓటర్ల దినోత్సవ ర్యాలీ

18 సంవత్సరాలు నిండిన ప్రతిపౌరుడికి ఓటు హక్కు  ఉండాలని ఆయన అన్నారు. పిబ్రవరి 14 తేదిన ఓటర్ల తుది జాబితా ప్రచురించి, విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ఓటర్లకు అవగాహన కల్పించడానికి కేంద్ర  ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందన్నారు. అనర్హులు ఉంటే తొలగించడం, మృతుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి  పెద్ల ఎత్తున సవరణ  ప్రక్రియ  చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఓటర్లంతా ప్రభుత్వం కల్పించే అవకాశాలను  సద్వినియోగం చేసుకోవాలని,  ఓటు హక్కు కోసం ఈ.ఆర్.ఓ.లకు లేదా తహసిల్ధార్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు.కార్యక్రమంలో భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, ఒంగోలు ఆర్.డి.ఓ ప్రభాకర్  రెడ్డి, డి.ఆర్.డి.ఎ.పి.డి.జె ఎలీషా, జిల్లా విద్యాశాఖ అధికారి వి.ఎస్.సుబ్బారావు, మోప్మా పి.డి.కె.కృపా రావు, కలెక్టరేట్ హెచ్ విభాగం పర్యవేక్షకులు సి.హెచ్. శ్రీనివాసరావు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు.  

No comments:
Write comments