స్కూల్‌ బస్సును ఢీకొన్న గ్యాస్‌ సిలిండర్ల ట్రక్‌.. తప్పింన పెను ప్రమాదం

 

సూరత్‌ జనవరి 9 (globelmedianews.com)
సూరత్‌లోని ఓల్పాడ్‌ ప్రాంతంలో గురువారం ఉదయం గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సును ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.బస్సును వేగంగా ఢీకొట్టడంతో ట్రక్‌లో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. 
స్కూల్‌ బస్సును ఢీకొన్న గ్యాస్‌ సిలిండర్ల ట్రక్‌.. తప్పింన పెను ప్రమాదం

ట్రక్‌లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు ఉండటంతో అవన్నీ అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో స్కూల్‌ బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే విద్యార్థులను వెంటనే కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేలుడు దృశ్యాలను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

No comments:
Write comments