పేద రైతు కుటుంబాలకు ఆర్డిటి చేయుత

 

ఉచితంగా పొలం పనులు          
మంత్రాలయం జనవరి 23 (globelmedianews.com)
మండల పరిధిలోని వగరూరు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ కి చెందిన పది కుటుంబాల రైతులకు  పొలంలో ముళ్ళకంపలను రాళ్లగుట్ట లను ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా తొలగిస్తున్నట్లు మండల కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏరియా కోఆర్డినేటర్ భాష కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. 
పేద రైతు కుటుంబాలకు ఆర్డిటి చేయుత

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ డెవలప్మెంట్ సంస్థవారు వగరూరు  గ్రామం లోని 10 కుటుంబాలు  రైతుల పొలంలో ఉన్న రాళ్లగుట్టలను ,ముళ్ళకంపలను  ఉచితంగా తొలగిస్తున్నట్లు తెలిపారు .ఒక్క రైతుకు మూడు నుంచి నాలుగు గంటల చొప్పున ఉచితంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

No comments:
Write comments