జగన్ జైలుకెళ్తే ఆ ముగ్గురు సీఎం కావాలని చూస్తున్నారు

 

 టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ
విజయవాడ జనవరి 28(globelmedianews.com)
: వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే సీఎం కావాలని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, రోజా ఆశపడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవి కోసమే వారు చంద్రబాబును దూషిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌ని ఏమనాలని ఆమె ప్రశ్నించారు. 
జగన్ జైలుకెళ్తే ఆ ముగ్గురు సీఎం కావాలని చూస్తున్నారు

పైరవీల కోసమే సచివాలయం అంటూ మంత్రి కన్నబాబు చీప్‌గా మాట్లాడుతున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌... రద్దుల రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా 5కోట్ల మంది ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మండలిలో 20మందికి పైగా బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని, బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పి... వైసీపీ వారి గొంతు కోస్తోందని విమర్శించారు. మండలి రద్దుపై సీఎం జగన్‌ పునఃసమీక్షించి, వెనక్కి తీసుకోవాలని పంచుమర్తి అనురాధ సూచించారు.

No comments:
Write comments