ఐచర్ వ్యాన్ బోల్తా…ముగ్గురు మృతి

 

అనంతపురం జనవరి 7, (globelmedianews.com)
జిల్లాలో తలుపుల మండలం గజ్జిలప్పగారిపల్లి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐచర్ వాహనం అదుపు తప్పిన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు, డ్రైవర్ శేఖర్, గంగిరెడ్డి, రమణారెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు వెంకటరెడ్డి, రాజు, హరిగా గుర్తించారు. 
ఐచర్ వ్యాన్ బోల్తా…ముగ్గురు మృతి

కడప జిల్లా వెంపల్లి నుంచి బెంగళూరుకు పూల లోడ్ తో వాహనం వెలుతుంది. బాధితులంతా  కడప జిల్లా పెండ్లిమర్రి మండలం బాలయ్యగారి పల్లి గ్రామానికి చెందినవారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

No comments:
Write comments