కల్వర్టు లో కారు..ఆరుగురు మృతి

 

శ్రీకాకుళం  జనవరి 4, (globelmedianews.com)
శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన మందస మండలం కొత్తపల్లి సమీపంలో జాతీయరహదారిపై జరిగింది. సింహాచలం నుండి బరంపురం(ఒడిస్సా) వెళ్తున్న కారు (ఓడీ 02 బీబీ 2282) అదుపు తప్పి కల్వర్టు లో దూసుకుపోవడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. 
కల్వర్టు లో కారు..ఆరుగురు మృతి

ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చంటి పిల్లతో పాటు మొత్తం ఆరుగురు ఘటన స్థలంలో మృతిచెందారు. డ్రైవర్ తీవ్ర గాయాలు తో బయట పడ్డాడు. మృతులంతా ఒడిస్సా కి చెందిన వారిగా మందస పోలీసులు గుర్తించారు.

No comments:
Write comments