భార్య కోసం భర్త, భర్త కోసం భార్య: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

 

న్యూ ఢిల్లీ జనవరి 3 (globelmedianews.com)
భార్యాభర్తలు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అప్పుడప్పుడు కోపతాపాలు వచ్చినప్పటికీ.. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఇలా నిరంతరం ఒకరికోసం ఒకరు బతుకుతుంటారు. అలాంటి భార్యాభర్తల గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.2018లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ.. భర్త వెంటే భార్య ఎందుకు నడుస్తుంది.. అనే అంశంపై ఆమె స్పష్టత ఇచ్చారు. 
భార్య కోసం భర్త, భర్త కోసం భార్య: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తాను సంప్రదాయక మహిళను అని అందరూ అంటుంటారు. తాను తన భర్త కంటే రెండు అడుగులు వెనుకే నడుస్తాను. తన లాంటి మహిళలకు ఇది సమస్య. కానీ ఇది సమస్య కాదు. అలాంటి విలువలు దేవుడు తనకు ప్రసాదించాడు. తన భర్త తనకు సహకరిస్తాడు. అతనికి తాను సహకరిస్తాను. అందుకే ఆయన అడుగులో అడుగేసి రెండు అడుగులు వెనుకే నడుస్తాను అని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు.స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ఇప్పటికే టిక్‌టాక్‌ వీడియోలు చేశారు. ఆ వీడియోల్లోని ఓ వీడియోను లాజికల్‌ థింకర్‌ అనే ట్విట్టర్‌ పేజీలో మళ్లీ పోస్టు చేశారు. భారతీయ మహిళ భర్త వెనుకాలే ఎందుకు నడుస్తుందో తెలియజెప్పడానికి ఇది మంచి వివరణ అని ఆ వీడియోకు ట్యాగ్‌ లైన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

No comments:
Write comments