మెనూ అమలులో నిర్లక్ష్యం వహించరాదు

 

మంత్రాలయం  జనవరి 29, (globelmedianews.com)
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వండి పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని తుంగభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంను ఆకస్మిక తనిఖీ చేశారు. 
మెనూ అమలులో నిర్లక్ష్యం వహించరాదు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో మెనూ లో మార్పు చేయడం జరిగిందన్నారు. అనంతరం అక్కడే విద్యార్థులకు ఏర్పాటు చేసిన భోజనంను రుచి చూశారు. ఈయనతో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి  తదితరులు ఉన్నారు.

No comments:
Write comments