ఏసీబీ వలలో ముగ్గురు మహిళా ఉద్యోగులు

 

వరంగల్ జనవరి 31  (globelmedianews.com)
వరంగల్ ఎంజీఎం లోని నర్సింగ్ హాస్టల్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో నర్సింగ్ ప్రిన్సిపాల్ సతీష్ కుమారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. జ్యోతి అనే ఉద్యోగి కి రిలీవింగ్ ఆర్థర్ ఇచ్చేందుకు సతీష్ కుమారి లంచం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో అక్కడి ట్యూటర్లు శోభారాణి, శారదలు పాలుపంచుకున్నారు. 
ఏసీబీ వలలో ముగ్గురు మహిళా ఉద్యోగులు

ముగ్గురూ లంచం డిమాండ్ చేయడంతో బాధితురాలు జ్యోతి ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం రూ  40 వేల రూపాయలు లంచం తీసుకుంటునప్పుడు రెడ్ హ్యండెడ్ గా ముగ్గురిని పట్టుకున్నారు.  ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు వెల్లడించారు.

No comments:
Write comments