ఆత్యాచారం, హత్య కేసులో ఐదుగురు ఆరెస్టు

 

నెల్లూరు జనవరి 9 (globelmedianews.com)
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలో గల చవటపాలెం లో గత ఆదివారం రాత్రి జరిగిన మహిళ అత్యాచారం, హత్య కేసులో ముద్దాయిలను గూడూరు రూరల్ పోలీస్ లు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ప్రధాన ముద్దాయిలుగా ఐదు మందిని గుర్తించారు. వీరిలో ముగ్గురకి నేత చరిత్ర వున్నట్లు గుర్తించారు. వీరి మీద పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్లు ఉన్నాయి. వీరంతా చవటపాళెంకు చెందిన వారు. దగ్గుబోయిన సాయి శివకుమార్, గోవింద స్వామి, మద్దూరు సుబ్రమల్లి వినోద్ కుమార్,  చల్లా లక్షమ్మయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్యాచారం, హత్య కేసులో ఐదుగురు ఆరెస్టు

గూడూరు రూరల్ సీఐ  రామకృష్ణా రెడ్డి చెప్పిన వివరాల మేరకు ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని అమ్మాయి దోస పిండి కోసం ఇంట్లోనుంచి బయటకు రాగా అప్పటికే బయట ఉన్న నిందితులు ఆ అమ్మాయిని బలవంతగా పక్కనే ఉన్న  పాత ఇంటిలోకి తీసుకెళ్లిఆహత్యాచారం చేయబోయారు. దాంతో ఆమె  ప్రతిఘటించింది.అప్పుడు  సాయి బండ రాయితో ఆమె తలమీద కొట్టడంతో కిందపడిపోగా తరువాత అందరూ ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు.  తరువాత అమ్మాయి ని బ్లెడ్ తో పలుచోట్ల కోసి చంపి వేశారని సీఐ వివరించారు..కేసును సవాల్ గా తీసుకున్న  నెల్లూరు జిల్లా పోలీసు సుపెరిండెంట్ భాస్కర్ భూషణ్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి స్పెషల్ టీమ్ లని వేసారు. ఆత్మకూరు డీఎస్యపీ  పర్యవేక్షణలో గూడూరు రూరల్ సీఐ, రూరల్ ఎస్సై, చిల్లకూరు ఎస్సైలను టీమ్ లుగా వేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
పట్టించిన చిన్న ఆధారం..
సాయి అనే పాత ముద్దాయి ఇంతకు ముందు ఒక హత్యకేసులో సర్జికల్ బ్లెడ్ ఉపయోగించి హత్యచేసాడు.,ఇప్పుడు జరిగిన అమ్మాయి హత్య కేసులో కూడా సర్జికల్ బ్లెడ్ ఉపయోగించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. వీరు హత్యచేసి తప్పించు కుని తిరుగుతుండగా కొండాగుట రైల్వే  స్టేషన్ దగ్గర పట్టుకున్నామని పోలీసులు వివరించారు.
దిశకేసుగా నమోదుగూడూరు ఘటన ను దిశ కేసుగా నమోదు చేస్తామని ముద్దాయిలను త్వరిత గతిన శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు.

No comments:
Write comments