నిధులపై నిర్లక్ష్యం (ఆదిలాబాద్)

 

ఆదిలాబాద్, జనవరి 19 (globelmedianews.com): 
అవగాహన లోపంతో అందుబాటులో స్టీమ్ మిషన్ ఉన్నా వినియోగించడం లేదు. రూ. లక్షల నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తే అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఏడాదిగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో అన్నం, ఇడ్లీ తయారీ పాత్రలు అలంకారప్రాయంగా మారాయి.  గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సకాలంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సరఫరా అయిన అధునాతన అన్నం, ఇడ్లీ తయారీ పాత్రలు ఏడాదిగా నిరుపయోగంగా మారాయి. జిల్లాలో 12 ఆశ్రమ పాఠశాలల్లో స్టీమ్‌కుక్‌ (ఆవిరితో వంటచేసే యంత్రాలను) బిగించారు. వాటిపై వంట చేయడం లేదు. 
నిధులపై నిర్లక్ష్యం (ఆదిలాబాద్)

ఆదిలాబాద్‌ గిరిజన ఆశ్రమ బాలికలు, మామిడిగూడ, కోలాం బాలురు, బాలికలు మేడిగూడ, జాతర్ల బాలురు, ఉట్నూర్‌ బాలికలు, నార్నూర్‌ బాలికలు, కేస్లాపూర్‌ బాలికలు, నార్నూర్‌లో ప్రాథమిక పాఠశాల, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ క్రీడాపాఠశాల, ఉట్నూర్‌ బాలురు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇవి పని చేయడం లేదు. 33 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు మంజూరైన పాత్రలను వంటలు తయారు చేసేందుకు సిద్ధం చేయలేదు. చాంద్‌పల్లి గిరిజన ఆశ్రమ బాలికలు, ఉమ్రి(టి) బాలికలు, వాన్‌వట్‌, అందర్‌బంద్‌, జరిపూనగూడ, తాంసి, తోషం, బేల, సైద్‌పూర్‌, మాడగూడ బాలికలు, నేరడిగొండ బాలికలు, రాయిగూడ బాలురు, పట్నాపూర్‌ బాలురు, పార్డీ(బి) బాలురు, బజార్‌హత్నూర్‌ బాలురు, కొర్టికల్‌ బాలురు, నర్సాపూర్‌ బాలికలు, జామ్డా బాలికలు, అర్జుని బాలికలు, లక్షేట్టిపేట, పిట్టబొంగారం, మాన్కపూర్‌, తడిహత్నూర్‌, గాదిగూడ, వడ్గాం, హస్నాపూర్‌, జరి, ఏందా, భీంపూర్‌, కొలాంగూడ, సాలేగూడ, బోథ్‌ బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో స్టీమ్‌కుక్‌ వంట సామగ్రిని సరిగా ఏర్పాటు చేయలేదు. జిల్లాలో మొత్తం 50 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. బోథ్‌ డివిజన్‌లో 14 పాఠశాలల్లో 4050 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉట్నూర్‌ డివిజన్‌లో 22 పాఠశాలలకు 8050 మంది, ఆదిలాబాద్‌ డివిజన్‌లో 14 పాఠశాలలకు 4315 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సకాలంలో భోజనం అందించేందుకు స్టీమ్‌కుక్‌ యంత్రాలు మంజూరయ్యాయి. వీటిపై అన్నం, ఇడ్లీ తయారీ గురించి ఆయా ఆశ్రమ పాఠశాలల్లో వంట సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల చాలా చోట్ల వీటిని ఉపయోగించడం లేదని తెలుస్తోంది. డివిజన్‌కు ఒకరిద్దరికి స్టీమ్‌ కుకింగ్‌పై శిక్షణ ఇప్పించినట్లుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పలు పాఠశాలలను పరిశీలిస్తే వినియోగంలో లేక అలంకారప్రాయంగా మారాయి. వీటిపై వండితే వంటగ్యాస్‌ త్వరగా పూర్తవుతుందని అందుకే ఎక్కువగా వాడడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు ఇడ్లీలు చేయడం కష్టమే. అదే స్టీమ్‌కుకింగ్‌ యంత్రాలపై ఎంతమందికైనా సరే త్వరగా వండేయవచ్ఛు అన్నం కూడా త్వరగా ఉడుకుతుంది. పొగ లేకుండా ఆవిరిపై వంట పూర్తవుతుంది. పాఠశాల భోజన సమయానికి విద్యార్థులకు వేడివేడి భోజనం అందించే వీలుంది.

No comments:
Write comments