రాజకీయంగా బీసీ అణిచి వేయాలనే కుట్రతో రిజర్వేషన్లను తగ్గింపు

 

జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నిరసన
హైదరాబాద్ జనవరి 6 (globelmedianews.com)
మున్సిపల్ ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుండి 29  శాతం కు తగ్గించడం పట్ల జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నిరసన తెలిపారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 34% యధాతథంగా అమలు చేస్తున్నారు. అలాగే తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 34 శాతం, మహారాష్ట్రలో 39 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. కాని  మన రాష్ట్రంలో బి.సి రిజర్వేషన్లను తగ్గించే అవసరం ఏముందని కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా అణిచి వేయాలనే కుట్రతో బీసీ రిజర్వేషన్లను తగ్గించారని ఆరోపించారు. 
 రాజకీయంగా బీసీ అణిచి వేయాలనే కుట్రతో రిజర్వేషన్లను తగ్గింపు

టి.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, శాసన సభ్యులు, నాయకులు  అందరూ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకువచ్చి, ప్రత్యేక చట్టం ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లను పెంచి, యదాతధంగా మున్సిపల్ ఎన్నికలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉంటే, రిజర్వేషన్లను తగ్గించడంలో ఏమైనా ఔచిత్యం ఉందా..! దేశంలోని అనేక రాష్ట్రాలలో జనాభా ప్రకారం బీసీలకే 40 నుంచి 55 శాతం వరకు బి.సి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 34 శాతం  ఉన్న రిజర్వేషన్లను  29 శాతం  తగ్గించారు. అంతకుముందు గ్రామపంచాయతీలో 34 శాతం  నుంచి 22 శాతంకు  తగ్గించి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కృష్ణయ్య విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించకపోతే, యధాతధంగా పెంచకపోతే వచ్చే ఎన్నికలలో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.2014 రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో బీసీ కులాల జనాభా 52 శాతం అని శాస్త్రీయంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది. అదే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మునిసిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు ను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలి. కానీ 29 శాతం కు తగ్గించడమేమిటని అని ప్రశ్నించారు. ఒక వైపు జనాభా ప్రకారం 34 శాతం నుంచి 52 శాతం కు పెంచాలని డిమాండ్ చేస్తే, రిజర్వేషన్లను తగ్గిండం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మాచుకోకపోతే  ఈ ఎన్నికలలో తగిన బుద్ది చెబుతామన్నారు. ఈ సమావేశంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఉపాద్యక్షులు గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి, రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్,  రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శ వేముల రామకృష్ణ, రాష్ట్ర బి.సి హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అద్యక్షులు రాజేందర్, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు నరసింహ గౌడ్, రాష్ట్ర బి.సి సేన అద్యక్షులు బర్క కృష్ణ, రాష్ట్ర బి.సి ప్రజా సమితి అద్యక్షులు మధుసూదన్, రాష్ట్ర బి.సి ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఉపేందర్ గౌడ్, ఎస్సి/ఎస్టీ/బి.సి  హాస్టల్స్ చైర్మన్ G.కృష్ణ యాదవ్, పాల్గొని ప్రసంగించారు.

No comments:
Write comments