కేటీఆర్‌కు చంచాగిరి చేయవద్దు.. ఎర్రబెల్లికి జగ్గారెడ్డి కౌంటర్

 

హైదరాబాద్ జనవరి 3 (globelmedianews.com)
: కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించామని గుర్తు చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలకు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కేటీఆర్‌కు చంచాగిరి చేయవద్దంటూ కౌంటరిచ్చారు.
కేటీఆర్‌కు చంచాగిరి చేయవద్దు.. ఎర్రబెల్లికి జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ వారసత్వం కొనసాగిందని, నెహ్రూ తర్వాత ఇందిరా, తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారని, ఇక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారని, అందులో తప్పేముందని అన్నారు. ఎప్పుడనేది కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. కేటీఆర్‌లో సమర్థవంతమైన నాయకత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. మంత్రి ఎర్రబెల్లి.. కేటీఆర్‌ను పొగిడినా తప్పులేదని, భజన చేసినా పరవాలేదని, కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చేయవద్దని అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశంపార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి... ఈ విధంగా వ్యవహరించడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు.

No comments:
Write comments