గడప గడపకు బీజేపీ

 

లక్షటిపెట్ మంచిర్యాల 
జనవరి 03 (globelmedianews.com)
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా  శుక్రవారం పట్టణంలోని బోయవాడ లో బీజేపీ  ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికీ తిరుగుతూ కాలని సమస్యలు తెలుసుకుంటూనేతలు  ప్రచారం నిర్వహించారు.   రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే,   పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
గడప గడపకు బీజేపీ

ఈ సందర్భంగా  మంచిర్యాల జిల్లా ఇంచార్జీ రఘునాథ్ వేరబెల్లి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. గతంలో ఉన్న మాజీ పాలకవర్గ సభ్యులు పట్టణానికి వచ్చిన నిధులు దోచుకున్నారు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి బిజెపికి అవకాశం  ఇస్తే అవినీతి లేని పాలన అందించి మరియు పట్టణ అభివృద్ది చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వేముల మధు, మండల అధ్యక్షులు బోప్పు కిషన్,తమ్మినిడి శ్రీనివాస్,  చాతరాజు శివశంకర్, గోళ్ల రాజేశ్,  మేడి రవి, ఎనగందుల లక్ష్మణ్, హేమంత్ రెడ్డి, గోపతి రాజయ్య, కర్ణాల కిషన్, కొండ నరేష్, రవి గౌడ్ , కుమార్, మేడి వెంకటేశ్, హరికృష్ణ, నరేష్, మహేశ్, రమేష్, రాకేష్, లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments