గొల్లపూడి లో మార్మోగిన అమరావతి నినాదాలు

 

ఉద్యమకారులకు పోలీసులకు బాహాబాహి
అమరావతి రాజధాని ఆంధ్రుల హక్కు
మీడియాతో దేవినేని ఉమా
విజయవాడ రూరల్ జనవరి 20 (globelmedianews.com)
సోమవారం నాడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గొల్లపూడి పోలీస్ పహారా కు నిలయంగా మారింది. గొల్లపూడి లోని అన్ని వీధుల వెంట పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులపై, అమరావతి ఉద్యమకారులపై నిఘా పెట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రతి అడుగు పై కన్నేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన దేవినేని ఉమా ను వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. 
గొల్లపూడి లో మార్మోగిన అమరావతి నినాదాలు

ఉద్యమకారులు పోలీసులతో బాహాబాహీ తలపడుతూ జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా పదివేల మంది పోలీసులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి ఉద్యమకారులకు భయపడి డమ్మీ కాన్వాయ్ లో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం చరిత్రలో లిఖించదగ్గ అంశoగా పేర్కొన్నారు. అమరావతి కోసం 29 గ్రామాల అమరావతి రైతులతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లయినా లేదని ఇలాంటి నియంత ను ప్రజలు ఎప్పుడూ చూసి ఎరుగరని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.

No comments:
Write comments