ట్రాలీ ఢీకొని ఒకరి మృతి

 

లక్షటిపెట్ జనవరి 28 (globelmedianews.com)
మండలంలోని ఎల్లరం గ్రామానికి చెందిన పరుచూరి శ్రీరాములు( 68)  మంగళవారం వేకువజామున ట్రాలీ ఢీకొని మృతి చెందాడు. పట్టణ ఎస్సై దత్తాత్రి తెలిపిన  వివరాల ప్రకారం  మృతుడు పాల వ్యాపారం చేస్తాడని రోజులాగే  వేకువ జామునే లేచి తన వాహనంపై వెళ్తుండగా లక్షటిపెట్ నుండి జన్నారం వైపు వెళ్తున్న ఎపి15వై 4441నంబర్ గల టాటా ఏస్ వాహనం ఢీ కొంది. 
ట్రాలీ ఢీకొని ఒకరి మృతి

శ్రీరాములుకు తీవ్రమైన గాయాలయాయని  గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయినా  అప్పటికే మరణించాడని నిర్దారించారు. మృతుడి  బార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments:
Write comments