శివసేనలో అసంతృప్తి జ్వాలలు

 

ముంబై, జనవరి 2 (globelmedianews.com)
ఏదైనా ఒక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది కొందరే. వారే పార్టీలో తర్వాత కీలక నేతలుగా మారతారు. వారు చెప్పిందే అగ్రనేతలు సయితం వింటారు. ప్రతి పార్టీలోనూ సర్వసాధరణంగా కన్పించే విషయమే. అయితే అధికారం చేతుల్లోకి వచ్చాక, తాము అనుకున్న గోల్ సాధించిన తర్వాత వారిని పక్కన పెట్టేయడం సర్వసాధారణ విషయమే. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన శివసేనలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. శివసేనలో కీలక నేత సంజయ్ రౌత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారునిజానికి సంజయ్ రౌత్ శివసేనలో సీనియర్ నేత. బీజేపీతో కలసి ఉన్నప్పుడు సంజయ్ రౌత్ శివసేన వ్యవహారాలు నడిపేవారు. బీజేపీ అగ్రనేతలతో మాట్లాడటం దగ్గర నుంచి ఎన్నికలకు ముందు పొత్తులు, సీట్ల కేటాయింపు వంటి వ్యవహారాల్లో సంజయ్ రౌత్ కీలకంగా వ్యవహరించారు. 
శివసేనలో అసంతృప్తి జ్వాలలు

అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సంజయ్ రౌత్ నిర్వహించిన భూమిక చెప్పలేనిది. బీజేపీతో తెగదెంపులు అని తేలాక నేరుగా శరద్ పవార్ తో భేటీ అయింది సంజయ్ రౌత్.శరద్ పవార్, కాంగ్రెస్ లను ఒప్పించడంలో సంజయ్ రౌత్ సఫలమయ్యారు. వారు పెట్టిన షరతులు సయతం ఉద్ధవ్ థాక్రే కు చెప్పి థాక్రే కుటుంబానికి సీఎం పీఠం తొలిసారి దక్కేలా సంజయ్ రౌత్ చక్రం తిప్పగలిగారు. ఒకే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అనుకున్నట్లే జరిగింది. కానీ సంజయ్ రౌత్ ను మాత్రం ఉద్ధవ్ థాక్రే పక్కన పెట్టేశారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణకు సయితం సంజయ్ రౌత్ హాజరుకాలేదు. ముఖ్యమైన సమావేశాలకు కూడా సంజయ్ రౌత్ దూరంగా ఉన్నారఇందుకు కారణాలు ఉన్నాయంటున్నారు. మంత్రివర్గ విస్తరణ శివసేనలో అసంతృప్తి రేపిందంటున్నారు. తాను సిఫార్సు చేసిన వారికి మంత్రి పదవులు దక్కలేదన్న అక్కసుతో సంజయ్ రౌత్ ఉన్నారని సమాచారం. తన సోదరుడు సునీల్ రౌత్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినా వినలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఉద్ధవ్ థాక్రేకు, మాతృశ్రీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. శివసేనలో సీనియర్లను కాదని ఏకపక్షంగా మంత్రి పదవులిచ్చారన్న విమర్శలు మాత్రం జోరుగానే విన్పిస్తున్నాయి. సంజయ్ రౌత్ ను ఉద్ధవ్ కావాలనే దూరం పెట్టినట్లు కూడా పార్టీలో చర్చ జరుగుతోంది.

No comments:
Write comments