యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి

 

యాదాద్రి భువనగిరి జనవరి 6 (globelmedianews.com)
 వైకుంఠ ఏకాదశి కావడంతో తెలంగాణ తిరుమలగా విరాజిల్లుతున్న యాదాద్రిలో అనుబంధ ఆలయమైన పాతగుట్టలో లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చారు.  ఉదయం 6 గంటల 46 నిమిషాల నుండి ఉదయం 9 గంటల వరకు రెండు గంటల పదిహేను నిమిషాలపాటు ఉత్తర ద్వారంద్వారా యాదగిరీశుడు భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేసారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగి అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనదర్శనమిస్తుండడం భక్తులు పరవశులైయ్యారు. జయహో నరసింహ అంటూ భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. 
యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి

మరోవైపు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి కొండపైన ఆలయ పునర్ నిర్మాణ పనుల దృష్ట్యా సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాతగుట్టకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనికితోడు పాతగుట్టలో కొలువై ఉన్న స్వామివారు స్వయంభు కావడంతో స్థానికులతోపాటు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతోపాటు వీఐపీలు కూడా ఉత్తర ద్వారంద్వారా స్వామివారిని దర్శించుకుంటూ తరిస్తున్నారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావు, యాదాద్రి కార్యనిర్వాహణాధికారి గీతారెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారిని ఉత్తర ద్వారంద్వారా దర్శించుకొని తరిస్తున్నారు. మరోవైపు యాదాద్రి కొండపైన భక్తుల దర్శనార్థం నిర్మించిన బాలాలయానికి ఉత్తర ద్వారం లేకపోవడంతో స్వామివారు తూర్పు ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తూ భక్తులను కనువిందు చేస్తున్నారు

No comments:
Write comments