సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం

 

నెల్లూరు  జనవరి 23 (globelmedianews.com)
నెల్లూరు జిల్లా డి ఎస్ ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం ఖరారు అయినట్లు నెల్లూరు గ్రామీణ నియోజవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నుండి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఇ సూచనలు సలహాల మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య శాఖ మాత్యులు ఆళ్ల నాని ఆధ్వర్యంలో సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం నిర్వహించినట్లు తెలిపారు. 
సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం

ఇందులో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా కాకుటూరు లక్ష్మి సునంద, మడపర్తి శ్రీనివాసులు, బోడె వీర బ్రహ్మారెడ్డి, షేక్ సత్తార్, ఆనం అభిషేక్ రెడ్డి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలియజేశారు. వీలున్నంత త్వరలో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

No comments:
Write comments