మున్సిపల్స్ లో మహిళా ఓటర్లే కీలకం

 

నల్గొండ, జనవరి 7, (globelmedianews.com)
రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటు నమోదులో మహిళలే చైతన్యం చూపారు. మున్సిపాలిటీల వారిగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 22 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 53 లక్షల 36 వేల 605 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా  ఓటర్లు 26 లక్షల 64 వేల 557 మంది ఉన్నారు.ఆదిలాబాద్‌ జిల్లాలో 63 వేల 57 మంది పురుష ఓటర్లు ఉండగా.. 64 వేల 738 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్‌లో 2 లక్షల 12 వేల 17 మంది పురుషులు ఉండగా.. 2 లక్షల 23 వేల 803 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో లక్షా 38 వేల 558 పురుష ఓటర్లు ఉండగా.. లక్షా 43 వేల 704 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 
మున్సిపల్స్ లో మహిళా ఓటర్లే కీలకం

సూర్యాపేట లో లక్షా 7 వందల 77 మంది పురుషులు, లక్షా 7 వేల 73 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అటు ఖమ్మంలో 34 వేల 704 మందికి పురుష ఓటర్లు ఉండగా.. 35 వేల 6 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 44 వేల 31 మంది పురుష ఓటర్లు ఉంటే .. 47 వేల 460 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరోవైపు నిర్మల్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, మహబూబ్‌ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేటలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు..మరోవైపు ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో 53 లక్షల 37 వేల 260 మంది ఓటర్లు ఉన్నారు. ముందుగా ప్రకటించిన ఓటర్ల సవరణ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 3వ తేదీతో అభ్యంతరాల పరిష్కారానికి గడువు ముగిసింది. దీంతో ముసాయిదా జాబితాలో కంటే 655 మంది ఓటర్లు మాత్రమే తగ్గారు. తుది జాబితా ప్రకారమే రిజర్వేషన్లును ఖరారు చేశారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

No comments:
Write comments