ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

 

జమ్ముజనవరి 31  (globelmedianews.com)
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ము శివారు ప్రాంతం నగ్రోటాలోని టోల్‌ ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ సైతం గాయపడ్డాడు. ట్రక్కులో ప్రయాణిస్తున్న ముగ్గురు సభ్యులుగా గల ఉగ్రవాదులు బృందం టోల్‌ప్లాజ్‌ సమీపంలోకి చేరుకునేసరికి ఒక్కసారిగా పోలీస్‌ టీంపై కాల్పులు జరిపారు. 
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌కు చెందిన ట్రక్కును సోదాల నిమిత్తం పోలీసులు ఆపగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు జరపడంతో సంఘటనా స్థలంలోనే ఓ ఉగ్రవాది మృతిచెందగా మరో ఇద్దరు సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది మరికొన్ని గంటల్లోనే పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్ము ఐజీ ముఖేశ్ సింగ్ తెలిపారు.

No comments:
Write comments