కోతుల బీభత్సం ..

 

ఆందోళనలో మహిళలు
వనపర్తి జనవరి 11, (globelmedianews.com):
మండల కేంద్రమైన గోపాల్ పేట లో కోతులు బీభత్సం సృష్టించడంతో మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంటి ఆవరణలో వేసిన పండ్ల చెట్ల పై కోతులు బీభత్సవాన్ని సృష్టిస్తూ కాయలను పండ్లను తింటూ కొమ్మలను నేలరాస్తున్నాయని మహిళలు విమర్శిస్తున్నారు.పధానంగా జామ మామిడి, కొబ్బరి చెట్ల పై కోతులు  వీరవిహారం చేస్తూ వాటిని తినడమే కాకుండా హరితహారం కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నాయని.అలాగే గుంపులు గుంపులు గా వస్తున్న కోతులు ఇంటి ఆవరణలోకి ప్రవేశించడమే కాకుండా ఇంట్లో ప్రవేశిస్తూ మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
కోతుల బీభత్సం ..

ఈ విషయం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినాఎటువంటి  ఫలితం లేకపోయిందని మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఈ కోతల వల్ల హరితహారానికి తీవ్ర నష్టాన్ని  కలిగిస్తున్నాయని వారంటున్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడి పర్యావరణానికి నాంది పలకాలని అధికారులు నాయకులు అంటున్నారే తప్ప ఈ కోతులపై చర్యలు తీసుకునేదెఎవరని వారు ప్రశ్నించసాగారు.గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కోతులను నిర్మూలిస్తామని అన్నారే తప్ప గెలిచిన తర్వాత వాటి నిర్మూలన గురించి పట్టించుకోవడం లేదని మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కోతుల పై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు

No comments:
Write comments