ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్

 

నిర్మల్ జనవరి 06  (globelmedianews.com)
జిల్లాలోని మున్సిపాలిటీలకు ఈ నెల 22న నిర్వహించు ఎన్నికల నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ద్వారా ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాల రాష్ట్ర అబ్జర్వర్ శ్రుతి ఓజా సమక్షంలో  సిబ్బందిని నియమించడం జరిగింది.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, భైంసా మరియు ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించడం జరిగింది. 
ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికల  అబ్జర్వర్

నిర్మల్ మున్సిపాలిటీ లో 42 వార్డులు,128 పోలింగ్ కేంద్రాలకు 168 పిఓలు,168ఏపీఓ లు,503 ఓపిఓలు మొత్తం 839 మంది సిబ్బందిని, బైంసా మున్సిపాలిటీ లో 26 వార్డులు, 66 పోలింగ్ కేంద్రాలకు గాను 85 పివో లు, 85 ఏపీఓ లు,254ఓపిఓ లు మొత్తం 424 సిబ్బందిని, ఖానాపూర్ 12 వార్డులు 24 పోలింగ్ కేంద్రాలకు గాను31పివో లు,31 ఏపిఓ లు,94 మంది ఓ పి ఓ లు మొత్తం 156 మంది ని రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 80 వార్డులు, 218 పోలింగ్ కేంద్రాలు లకు 284పిఓలు,284ఎపిఓలు,851ఒపిఓలు మొత్తం 1419 నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, డి.ఎస్.పి ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్ డి ఓ ప్రసూనాంబ, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మల్లేశం ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీమ్ ఖాన్, డిటి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments