గోనెసంచిలో మహిళ శవం

 

చిత్తూరు జిల్లాలో దారుణం
చిత్తూరు  జనవరి 11  (globelmedianews.com)
గోన సంచి లో గుర్తు తెలియని మహిళ శవాన్ని కనుగొన్నట్లు పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి కె.వి పల్లి మండలం గ్యారంపల్లె  కస్పా సమీపంలోని పీలేరు రాయచోటి జాతీయ రహదారి లోని  వ్యవసాయ పొలాల్లో ఒక గుర్తు తెలియని మహిళ శవాన్ని గోనెసంచిలో తెచ్చి పడ వేసినట్లు స్థానికులు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధినం చేసుకున్నారు. 
గోనెసంచిలో మహిళ శవం

మృతురాలు ఆకుపచ్చని చీర, ఎర్రని జాకెట్ ధరించి ఉంది.  అలాగే ఆమె మెడలో రోల్డ్ గోల్డ్ చైను పై అయా  అన్న అక్షరాలను గుర్తించారు. మహిళను మరో చోట హతమార్చి ఇక్కడ తెచ్చి పడవేశాని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు మహిళను  ఎవరైనా గుర్తించినట్లయితే పీలేరు రూరల్ సిఐ కు సమాచారం అందించాలని అయన  సూచించారు. మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

No comments:
Write comments