షాద్ నగర్ పట్టణంలో చిరుత పులి హాల్ చల్

 

రంగారెడ్డి జనవరి 20  (globelmedianews.com)
షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి హల్ చల్ చేసింది.  అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై నిద్రలోకి జారిపోయింది ఇది  గమనించిన ఇంటి యజమాని 100 కు డియర్ చేశాడు. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉండటం వల్ల చిరుత అక్కడి నుండి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తుందనీ స్థానికంగా హల్చల్ జరిగింది. అయితే నిజంగా చిరుతపులి షాద్నగర్ పట్టణంలోని నగర నడిబొడ్డులో హల్చల్ చేసింది. 
షాద్ నగర్ పట్టణంలో చిరుత పులి హాల్ చల్

విజయ్ కుమార్ ఇంటి పైన ఎలా చేరిందో తెలియదు కానీ దాబా పై తీరిగ్గా నిద్రపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శంషాబాద్ డీసీపీ  ప్రకాష్ రెడ్డి షాద్ నగర్ ఏసీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, సిబ్బంది పటేల్ రోడ్డుకు చేరుకున్నారు.  చిరుత పులిని చూడడానికి జనాలు ఎగబడ్డారు. పటేల్ రోడ్డులో భయానక వాతావరణం నెలకొంది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయగా నిద్రిస్తున్న చిరుతకు మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం భోను లో హైదరాబాద్ జూ పార్క్ కు తరలించారు.  ఈ క్రమంలో చిరుత  దాడి చేయగా కానిస్టేబుల్ లక్ష్మన్ కు స్వల్ప గాయాలయ్యాయి.

No comments:
Write comments