భద్రతాబలగాల ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం

 

శ్రీనగర్ జనవరి 20 (globelmedianews.com):
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదుల్నిపోలీసులు హతమార్చారు. సోమవారం ఉదయం షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాలు వారిని మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. వాచ్ఛి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
భద్రతాబలగాల ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం

వీరి రాకను గుర్తించిన హిజ్బుల్ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని, లొంగిపోవాలని తాము హెచ్చరికలు జారీ చేసినా లెక్కచేయకపోవడంతో తమ బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారనీ, వీరిలో అదిల్‌ అహ్మద్‌ అనే వ్యక్తి గతంలో పోలీసుశాఖలో పనిచేశారని అధికారులు తెలిపారు.

No comments:
Write comments