అది కూడా ఓ గెలుపేనా!?.. కేటీఆర్‌పై మండిపడ్డ బీజేపీ లక్ష్మణ్

 

హైదరాబాద్ జనవరి 28(globelmedianews.com)
: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ బీజేపీ కార్యాలయంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మించిన అవకాశవాదులు రాజకీయాల్లో ఎవరు లేరన్నారు. కారు కూతల కేటీఆర్.. నోటిని అదుపులో పెట్టుకోవాలని లక్ష్మణ్ ఒకింత హెచ్చరించారు.  ‘అక్రమాలు చేస్తూ.. ఆదర్శాలు వల్లించడం తండ్రి, కొడుకులకే చెల్లింది. మీ ఇద్దరూ అసంతృప్తి, అనుమానం, అభద్రత, ఆక్రోశానికి నిలువుటద్దం. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఏకైక పార్టీ బీజేపీ. వార్డుల రూపకల్పన, రిజర్వేషన్లలో టీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడింది. అధికార దుర్వినియోగం చేసి గెలవటం కూడా .. ఓ గెలుపేనా?’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
అది కూడా ఓ గెలుపేనా!?.. కేటీఆర్‌పై మండిపడ్డ బీజేపీ లక్ష్మణ్

బీజేపీ అంటే టీఆర్ఎస్‌కు భయం పెరిగిందని అన్నారు. కేసీఆర్ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ‘నిజామాబాద్‌లో మూడో స్థానంలో ఉన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తుక్కుగూడలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీతో ఎలా ఓటు వేయిస్తారు?. తుక్కుగూడ ఛైర్మన్ ఎన్నికను రద్దు చేయాలి. మంత్రి సబితారెడ్డి చర్యలతో ఇంద్రారెడ్డి ఆత్మ గోషిస్తోంది. దేశంలోని మా ఎంపీలందరితో ఓటు వేయిస్తే.. టీఆర్ఎస్‌కు ఒక్క మున్సిపాలిటీ దక్కదు. నిజామాబాద్ ప్రజలు పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను తిరస్కరించారు. బైంసాలో ఒక్క వార్డు కూడా గెలవని టీఆర్ఎస్.. బీజేపీని విమర్శించడమా?’ అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీని టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్‌ను మించిన నియంత దేశంలోనే ఎవ్వరూ లేరు. కేసీఆర్ అవినీతి పాలనపై ఉద్యమించి ప్రజలకు చేరువవుతాం. మేం ఫిర్యాదులు చేస్తే మంత్రులు అడ్డుకుంటున్నారు. అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతోంది. జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది’ అని లక్ష్మణ్ లిపారు.

No comments:
Write comments