ప్రతి రైతు ఈ-కర్షక్ ద్వారా పంట నమోదు చేసుకోవాలి

 

తుగ్గలి జనవరి 07 (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు ప్రవేశపెట్టిన ఈ- కర్షక్ యాప్ నందు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని అగ్రికల్చర్ అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ రబీ సీజన్ నందు రైతులు వేసిన పప్పు శనగ,జొన్న ఇతర పంటలను ఈ-కర్షక్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలియజేశారు.రైతులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల పరంగా పంట నమోదు కొరకు వ్యవసాయ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
ప్రతి రైతు ఈ-కర్షక్ ద్వారా పంట నమోదు చేసుకోవాలి

రైతులు గ్రామాల పరంగా అధికారులను సంప్రదించి పంట నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ-కర్షక్ యాప్ ద్వారా పంట నమోదు అయితేనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇన్సూరెన్స్ పథకాలు వర్తిస్తాయని,పంట నమోదు లేనియెడల రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించవని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఈవో స్రవంతి,విఆర్ఏ లు అశోక్, హంపయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments