పంచసూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి

 

జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి
పెద్దపల్లి జనవరి 03(globelmedianews.com)
పంచసూత్రాలను గ్రామంలో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిలో అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి  అన్నారు.   శుక్రవారం  సుల్తానాబాద్  మండలం  బొంతకుంటపల్లి  గ్రామంలో నిర్వహించిన స్వచ్చ శుక్రవారం  కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్  పాల్గోన్నారు.  బొంతకుంటపల్లి   గ్రామాన్ని జేసి పర్యటిస్తూ  పంచసుత్రాల అమలు ను పరిశీలించారు.   గ్రామ ప్రజలతో  జేసి పంచసుత్రాల పై అవగాహన కల్పించారు.  బొంతకుంటపల్లి  గ్రామంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని,  వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. మన జిల్లాలో ప్రతి గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేసి అవసరమైన  సదుపాయాలు కల్పించామని అన్నారు.  
పంచసూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి

జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత  నిర్మించామని ,  గ్రామంలో  పెండింగ్ లో ఉన్న ఇంకుడగుంత నిర్మాణ పనులు  త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను  కలెక్టర్ ఆదేశించారు.    వర్షపు నీరు నిల్వ ఉండకుండా  కమ్యూనిటి ఇంకుడుగుంతలను  పెద్ద సంఖ్యలో ఎర్పాటు చేసామని  తెలిపారు.  తడి చెత్త  పోడి చెత్త, ప్లాస్టిక్ వేర్వేరుగా సేకరిస్తున్నామని, ప్రతి ఇంటిలో కాంపోస్ట్ పిట్ ఎర్పాటు చేయడంతో పాటు  గ్రామంలో  కాంపోస్ట్  షెడ్,  ప్లాస్టిక్ సేకరణ  యూనిట్ ఎర్పాటు చేయాలని అన్నారు.     గ్రామంలో ప్రతి ఇంటిలో  కిచెన్ గార్డెన్ ఎర్పాటు చేసుకొని,  మహిళలు నెలసరి సమయాల్లో  సబల శానిటరీ న్యాపకిన్  ను ఉపయోగించడం పట్ల అవగాహన  కల్పిస్తు  పంచసూత్రాలు పూర్తి స్థాయిలో పకడ్భందిగా అమలు చేయాలని అన్నారు.   రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్భందిగా అమలు చేయాలని,  హరిత మహలక్ష్మి కింద నాటిన మొక్కలను గ్రామ పంచాయతి సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని అన్నారు. చెత్త నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని అమలు చేయాలని, రోడ్ల పై చెత్త వేసే వారి నుంచి భారీ జరిమానాలు విధించి వసూళ్లు చేయాలని, ప్రైవేటు వ్యక్తులకుసంబంధించిన ఖాళీ స్థలాలో చెత్త వేయకుండా , వాటిని పరిశుభ్రంగా నిర్వహించే బాధ్యత సదరు  భూ యాజమాన్యులకు అప్పగించాలని  జేసి సూచించారు. పాతబడిన బావులను పూడ్చివేసామని, అవెన్యు ప్లాంటేషన్ లో నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తిసుకోవాలని, 85 శాతం వరకు నాటిన మొక్కలను సంరక్షించాచలని  జేసి అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లె ప్రగతికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని,  జనవరి మాసంలో గ్రామాలను ఫ్లైయింగ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేస్తాయని, అలసత్వం వహించే ప్రజాప్రతినిధులు, అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసి  తెలిపారు. ఎంపిడిఒ, గ్రామ సర్పంచ్,  ప్రజాప్రతినిధులు, ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గోన్నారు.

No comments:
Write comments