పరిశుభ్రత నిరంతర పక్రియ

 

వరంగల్ అర్బన్ జనవరి 8  (globelmedianews.com)
పచ్చదనం పరిశుభ్రత నిరంతర పక్రియ అని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే  పాటిల్ అన్నారు. రెండో విడత పల్లె బాట కార్యక్రమంలో బాగంగా  బుధవారం వెలెరు మండలంలోని ఎర్రబెల్లి, కాన్నారం  మద్దెల గూడెం లలో పల్లె ప్రగతి లో చేపట్టిన పనులను జడ్పీ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్ తో కలిసి పరిశీలించారు  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు ప్రజల  సహకారం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు  కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా  వాటిని వినియోగించుకొని గ్రామ అభివృద్ధికి దోహద పడేవిదంగా కృషి చేయాలన్నారు 
పరిశుభ్రత నిరంతర పక్రియ

ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నెల నెల జనాభా ప్రాతిపదికన నిధులను మంజూరు చేస్తున్నందున వాటిని పారదర్శకంగా ఖర్చు చేసుకోవాలన్నారు  ప్రజల భాగస్వామ్యం తో   స్థానిక ప్రజా ప్రతి నిధులు సహకారం తో అధికారులు  గ్రామాల  సమూల మార్పులకు  కృషి చేయాలన్నారు గ్రామపంచాయతీ లలో డంపింగ్ స్మశాన వాటికల నిర్మాణాలు  ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మాణాలు   పండ్ల మొక్కలు  పెంచడం  చెత్తను విచ్సల విడిగా ఏక్కడ పడ్తే అక్కడ. పడేయకుండా   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు   గ్రామ పారిశుధ్య కార్మికులకు చే రోజువారీగా  ఇంటింటికీ చెత్త సేకరణ తో పాటుగా మురుగు కాల్వల శుభ్రం  నీటి  నిలవ గుంతలను పూడ్చడం నీటి నిల్వ ప్రదేశాలలో  దోమల నివారణకు చర్యలు చేపట్టి వ్యాధులు  ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారుపచ్చని చెట్ల మూలంగా పర్యావరణ పరిరక్షణ  తో పాటుగా వాతావరణ సమతుల్యం వలన  ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.జిల్లా పరిషత్ చైర్మెన్ డాక్టర్ సుదీర్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసుకొనే అవకాశం వచ్చినందున రాజకీయాలు  అతీతంగా గ్రామాభివృద్ధికి చేయూత  నివ్వలని అన్నారు.  ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి  ఆలోచించి  గ్రామాల అభివృద్ధికి  నిధిలులను మంజూరు చేస్తూ అట్టి నిధులను గ్రామ ప్రగతి కి సక్రమంగా  వినియోగించు కోవడానికి  ప్రజల భాగస్వామ్యం  అధికారుల సహకారం   ఎంతో అవసరమని చెప్పారు. ముందుగా  వెలేర్ మండలం ఎర్రబెల్లి లో  పల్లె ప్రగతి లో పాల్గొని జడ్పీ చైర్మెన్ డాక్టర్ సుదీర్ కుమార్ తో  కలిసి  పనులను పరిశీలించిన  కలెక్టర్  వైకుంఠ దామాం నిర్మాణాన్ని ఫిబ్రవరి చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  జి పి లో నూతనంగా  కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ప్రారంభించి  కలెక్టర్ కొద్ది దూరం ట్రాక్టర్ ను నడిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేసే బాగంగా తన సొంత డబ్బుతో  ప్లాస్టిక్ ను  ప్రజల నుండి కొనుగోలు చేసిన గ్రామ ఉప సర్పంచ్  సతీష్ ను ఆభినందించి శాలువాతో కలెక్టర్  సన్మానించారు. కన్నారం లో పొడి తడి చెత్త  బుట్టలను  జడ్పీ చైర్మన్  కలెక్టర్ పంపిణీ చే సారు.

No comments:
Write comments