డ్రాఫ్ట్ పబ్లికేషన్ వెంటనే చేపట్టాలి

 

కర్నూలు, జనవరి 23 :  (globelmedianews.com)
ఓటరు జాబితా క్లైమ్, అభ్యంతరాలు పెండింగ్ లేకుండా చూసుకొని డ్రాఫ్ట్ పబ్లికేషన్ వెంటనే చేపట్టాలని  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయ్ పేర్కొన్నారు. గురువారం రాజధాని నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఈ ఆర్ వో లు, ఏ వి ఆర్ వో లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయ్ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటర్ జాబితా క్లైమ్,   అభ్యంతరాలు పెండింగ్ లేకుండా చూసుకొని ఫిబ్రవరి 14 నాటికీ ఓటర్ జాబితా ఎలక్ట్రోరల్ ప్రచురితం చేయాలన్నారు. 
డ్రాఫ్ట్ పబ్లికేషన్ వెంటనే చేపట్టాలి

ఈ ఆర్ వో లు డోర్ డోర్ వెళ్లి ఓటర్ జాబితా పూర్తిగా వెరిఫికేషన్ చేసి ఫిబ్రవరి 4వ తేదీ నాటికి ఓటర్ ముసాయిదా జాబితాను అప్డేట్ చేయాలన్నారు. అదేవిధంగా ఓటరు జాబితాలో డబల్ ఎంట్రీ అయినా వివరాలను సమగ్రంగా పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు.  పోలింగ్ కేంద్రాలు సరిహద్దులను జీయో మ్యాపింగ్, జీయో ట్యాగులను వెంటనే చేపట్టాలన్నారు. ఈనెల 25 ఓటర్ల జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బియల్ఓ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ ఏరియాల్లోనూ, కొత్తగా నమోదైన ఓటర్లను ప్రజా సభలో సన్మానం చేయాలన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియఫారం లో చురుకైన పాత్ర పోషించి ఉద్యోగస్తులకు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు సన్మానం చేయాలన్నారు. అదేవిధంగా 5కే, 2 కె రన్, కళాశాల, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించాలన్నారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, డిఅర్ఓ పుల్లయ్య జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఫిబ్రవరి మూడో తేదీ నాటికి పెండింగ్ లేకుండా ఓటర్ జాబితా ప్రచురితం చేస్తామన్నారు. క్లైమ్ మరియు అభ్యంతరాలు ఫారం 6-3,482, ఫారం 6-ఏ-05, ఫారం 7-2,632, ఫారం 8-940, ఫారం 8ఏ-443 పెండింగ్లో కలవనున్నారు. అదేవిధంగా క్లైమ్, అభ్యంతరాలు ఎస్ యస్ ఆర్ -2020 ఈనెల 22వ తేదీ నాటికి 14,522 రిసీవ్ అయ్యాయని,  అందులో 10,743 పెండింగ్ పెండింగ్లో కలవన్నారు. అలాగే డబల్ ఎంట్రీ 32,683 కలవని ప్రస్తుతానికి వెరిఫికేషన్ దశలో ఉందని తెలిపారు. ఓటర్ నమోదులో చిన్నచిన్న తప్పులు సంబంధించినవి 1,540 కేసులు జిల్లావ్యాప్తంగా కలవమన్నారు. అవి పూర్తిగా వెరిఫికేషన్ చేశామన్నారు. డెత్ కేసెస్ ఎంట్రీ డి ఈ ఓ లాగిన్ లో రిజిస్ట్రేషన్ చేసి వెంటనే అప్లోడ్ చేస్తామన్నారు. అదేవిధంగా ఈనెల 25 ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

No comments:
Write comments