సి ఏ ఏ పై బిజెపి పార్టీ అవగాహన

 

వనపర్తి జనవరి 08, (globelmeidanews.com):
మండల కేంద్రమయిన గోపాల్ పేట లో  బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సి ఏ ఏ పైనామండల అధ్యక్షులు  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బస్ స్టాండ్ ఆవరణ చుట్టుపక్కల వ్యాపార దుకాణాలకు మరియు సంత బజార్ నందు కరపత్రాలను పంచి  పౌరసత్వ సవరణ చట్టం 2019 భారతీయులు ఎవరి పైన వివక్ష చూపదని,
సి ఏ ఏ పై బిజెపి పార్టీ అవగాహన

పాకిస్తాన్ లోని నెహ్రూ లియాకత్ అలీ ఒప్పందం అమలుకు నోచుకోని కారణంగా అక్కడ ఉన్న మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ శరణార్ధులుగా వచ్చినటువంటి వారికి పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్ట సవరణని వారన్నరు.సి ఎ ఏ మరియు ఎన్ఆర్సీ పట్ల ప్రజలు అడిగిన సందేహాలకు వారు సమాధానం ఇస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పూరి సురేష్ శెట్టి , మండల అధ్యక్షులు అరవింద్ రెడ్డి , మండల నాయకులు మండల మాజీ అధ్యక్షులు నారాయణ  యాదవ్,  ఆనంద్ సాగర్, యాదగిరి శెట్టి, దామోదర్, వెంకటాచలం వెంకటేష్  ,పలు గ్రామాల భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Write comments