ప్రజాభాగస్వామ్యంతో పల్లెలు అభివృద్ది

 

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి జనవరి 03 (globelmedianews.com)
గ్రామంలోని ప్రజలంతా సమిష్టిగా కృషి చేస్తేనే గ్రామాభివృద్ది సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.   శుక్రవారం  జూలపల్లి  మండలం  కుమ్మరికుంట  గ్రామంలో నిర్వహించిన స్వచ్చ శుక్రవారం  కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్  పాల్గోన్నారు.  కుమ్మరికుంట గ్రామాన్ని కలెక్టర్  పర్యటిస్తూ  పంచసుత్రాల అమలు ను పరిశీలించారు.   గ్రామ ప్రజలతో  కలెక్టర్ పంచసుత్రాల పై అవగాహన కల్పించారు.  కుమ్మరికుంట  గ్రామంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని,  వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. 
ప్రజాభాగస్వామ్యంతో  పల్లెలు అభివృద్ది

కుమ్మరికుంట గ్రామంలో పూర్తి స్థాయిలో ఇంకుడగుంతల నిర్మాణం పూర్తి చేసుకొని  గ్రామంలోని మురికికాల్వలను పూడ్చివేసి వాటి స్థానంలో మంచి పూల మొక్కలను  నాటడం సంతోషకరమని  కలెక్టర్ అన్నారు.  మనం పూర్తి స్థాయిలో ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి చేసుకోవడం వల్ల  డెంగ్యు కేసులు గణనీయంగా తగ్గిపోయాయని,   రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పెద్దపల్లి ఆదర్శంగా  ప్రతి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఇంకుడుగుంతలు నిర్మించాలని సూచించారని, ఇది మనకు గర్వకారణమని కలెక్టర్ అన్నారు. మన జిల్లాలో ప్రతి గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేసి అవసరమైన  సదుపాయాలు కల్పించామని అన్నారు.   కుమ్మరికుంట గ్రామంలో స్మశానవాటిక నిర్మాణం పూర్తయిందని, దానిని  వినియోగించుకునేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించడానికి అవసరమైన రూ.1.5లక్షలను  కలెక్టర్ మంజూరు చేసారు.      వర్షపు నీరు నిల్వ ఉండకుండా  కమ్యూనిటి ఇంకుడుగుంతలను  పెద్ద సంఖ్యలో ఎర్పాటు చేసామని  తెలిపారు.  తడి చెత్త  పోడి చెత్త, ప్లాస్టిక్ వేర్వేరుగా సేకరిస్తున్నామని, ప్రతి ఇంటిలో కాంపోస్ట్ పిట్ ఎర్పాటు చేయడంతో పాటు  గ్రామంలో  కాంపోస్ట్  షెడ్,  ప్లాస్టిక్ సేకరణ  యూనిట్ ఎర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.     గ్రామ పంచాయతికి సంబంధించి  విద్యుత్ బిల్లలు ప్రతి మాసం  చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు.   పల్లె ప్రగతికి సంబంధించి రెండవ విడత గ్రామంలో పకడ్భందిగా అమలు చేయాలని,  గ్రామంలో ఎర్పాటు చేసిన వానర వనంలో  మంచి మట్టి వేసి మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  చెత్త నిర్వహణ పకడ్భందిగా చేయాలని, గ్రామంలో ఇంటి స్థాయిలో తడి చెత్త, పొడి చెత్తను విభజించాలని, తడి చెత్తను కంపొస్ట్ పిట్ వినియోగిస్తూ ఎరువు తయారు చేసుకోవాలని,  పొడి చెత్తలో ప్లాస్టిక్, గాజు, ఐరన్, పేపర్ లను ప్రత్యేకంగా సేకరించాలని కలెక్టర్ సూచించారు.  గ్రామంలోరొడ్ల పై చెత్త వేయరాదని, మన ఇంటితో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని  కలెక్టర్ అన్నారు.జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్,   గ్రామ సర్పంచ్,  ప్రజాప్రతినిధులు, ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గోన్నారు.

No comments:
Write comments