నిషాలోయువకుల డ్రైవింగ్…ఎస్సైకి గాయాలు

 

వికరాబాద్ జనవరి 2   (globelmedianews.com)
బుధవారం అర్ధరాత్రి నవాబుపేట ఎస్ఐ కృష్ణ తనిఖీలు చేస్తున్నారు.  వేగంగా వస్తున్న కారును ఆపబోయారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు ఆపకుండా  పోలీసులపైకి ఎక్కించారు. దాంతో ఆ ఎస్సైకి గాయాలయ్యాయి.  ఈ ఘటన  ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. అనంతగిరిలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు యువకులు వారి కారును ఆపకుండా నేరుగా పోలీసులను ఢీకొట్టారు. 
నిషాలోయువకుల డ్రైవింగ్…ఎస్సైకి గాయాలు

ఈ ఘటనలో ఎస్ఐ కాలు విరిగింది. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ కృష్ణని  సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారుతో పాటు అందులో ఉన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిషేధిత మత్తుపదార్థాలను వాడినట్లు పోలీసులు నిర్దారించారు. టోలీచౌకికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ లు గా గుర్తించారు.

No comments:
Write comments