బాలికల దినోత్సవం రోజునే విషాదం

 

అనుమానస్పద స్థితిలో బాలిక దుర్మరణం
హత్య అని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
సికింద్రాబాద్ జనవరి 24  (globelmedianews.com)
బాలికల దినోత్సవం రోజునే ఒక మైనర్ బాలిక అనుమానస్పదస్థితిలో తనువు చాలించింది. సికింద్రాబాద్ చిలకలగూడా  పోలీస్ స్టేషన్ పరిధి వారాసిగుడా లో నివాసముంటున్నమహమ్మద్ నజీర్ బేగ్ కూతురు  ఆరీఫా బేగం (17)  బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందింది. మృతురాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.  అయితే ఆమెను హత్య చేసి కిందకు పడేసినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
బాలికల దినోత్సవం రోజునే విషాదం

శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.  రెండు పెద్ద అపార్ట్ మెంట్ ల మధ్య అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని  ఘటనాస్థాలాన్ని పరిశీలించిన తరువాత మృతదేహాన్ని  గాంధీ మార్చురీకి తరలించారు. ఇర్ఫానాను  హత్యచేసి అపార్ట్ మెంట్ పై నుండి పడేసినట్టుగా ఫిర్యాదు అందింది. దాంతో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మృతురాలు  నివసిస్తున్న  ప్రాంతములోని ఒక స్కూల్ లో వున్న సీసీటీవీ ఫూటేజీని పోలీసులు  పరీశీలిస్తున్నారు.

No comments:
Write comments