తిరుచానూరు గ్రామ పంచాయతి లో తడి చెత్త,పొడి చెత్త పై అవగాహన

 

తిరుపతి  జనవరి 07 (globelmedianews.com)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది.తిరుచానూరు గ్రామ పంచాయతి లో గ్రామ సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్ లు,పంచాయతి సిబ్బంది తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కార్యక్ర మ్మాని ప్రతి ఇంటి వద్దకు వచ్చి కరపత్రా లను పంచి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని,తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతి వారు పంపే చెత్త 
తిరుచానూరు గ్రామ పంచాయతి లో తడి చెత్త,పొడి చెత్త పై అవగాహన

సేకరణ వాహనం(గ్రీన్ అంబాసిడర్) లో వెయ్యాలని కాలువలో వెయ్యకూడదు అని కోరారు. కాలువలో వేస్తే పంచాయతి రాజ్ చట్టం 1994 సెక్షన్ 94 మేరకు శిక్షర్హులు అని తెలియ జేశారు.తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి ఇదివరకే పంచాయతి వారు ఇచ్చిన ఎరుపు రంగు పచ్చ రంగు గల ప్లాస్టిక్ డబ్బాలను(డస్ట్ బిన్) ఉపయోగించు కోవాలని కోరారు.తిరుచానూరు  గ్రామ ప్రజలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు.ఈ కార్య క్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్ లు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు...

No comments:
Write comments